హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై త్యాగి నివేదిక కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితిపై ఆమె సోమవారం సమీక్షించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై తన నివేదికను త్యాగి కమిషన్ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని ఆమె చెప్పారు.
జైళ్లలో సెల్ జామర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఖైదీల్లో మానసిర ప్రవర్తన తెచ్చేందుకు జైళ్ల శాఖాధికారులు కృషి చేయాలని ఆమె కోరారు. జైళ్ల శాఖ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.