రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్..!
కేరళ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కేరళలో 85 లక్షలకుపైగా ట్రాఫిక్ ఈ చలాన్ లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ కు కేవలం ఒకటి బై మూడో వంతు ఆదాయం మాత్రమే సమకూరింది. దాదాపు 64 శాతం ఈ చలాన్ లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. గత మూడేళ్లుగా చలాన్లు పెండింగ్ లో పేరుకుపోయినట్లు సమాచారం.
కేరళలోని ట్రాఫిక్ ఫైన్ కలెక్షన్ వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. సిబ్బంది కొరత అలాగే చలాన్ ను ప్రింట్ చేసి సంబంధిత వాహనదారులకు పంపించేందుకు నిధులు లేకపోవడం ఈ ట్రాఫిక్ ఈ చలాన్ లు భారీగా పేరుకుపోవడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఈ చలాన్ లపై ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్ లు జనరేట్ చేసిన నోటీసులను సాధారణంగా సంబంధిత మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ లు లేదా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ లు పోస్టు ద్వారా పంపిస్తారు. కానీ వాళ్లు ప్రస్తుతం అధిక వర్క్ లోడ్ తో ఉన్నారు. అందువల్ల ఈ బాధ్యతలను మినిస్టీరియల్ సెక్షన్ లోని క్లెర్క్ లకు తాత్కాలికంగా అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఫిజికల్ గా నోటీసులు రాని వాహనదారులు తమ పెండింగ్ ఫైన్ లకు సంబంధించిన వివరాల కోసం అధికారులు పంపించే ఎస్ఎమ్ఎస్ పైనే ఆధారపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇలాంటి మెసేజ్ లను వాహనదారులు పట్టించుకోరని నోటీసులు పంపితేనే వారికి అర్థం అవుతుందని భావిస్తున్నారు.
ఈ మేరకు ఈ చలాన్ నోటీసులను సంబంధిత వాహనదారులకు వాట్సాప్ ద్వారా పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ స్టేట్ ఐటీ మిషన్ ఇప్పటికే తమ రికమండేషన్ ను సమర్పించింది. మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ లోని అన్ని వాట్సాప్ సర్వీసులను ఇంటిగ్రేట్ చేయాలని సిఫార్సులు చేసింది.

మరోవైపు తాము ఈ చలాన్ లు కట్టేందుకు డిస్కౌంట్ లు పెట్టాలని వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 85 లక్షలకు పైగా పెండింగ్ ఈ చలాన్ లు ఉన్న నేపథ్యంలో డిస్కౌంట్ లు పెడితే వాహనదారులు సకాలంలో చలాన్ లను పేమెంట్ చేస్తారని అధికారులు కూడా భావిస్తున్నారు. మరి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications