లాఠీ చార్జి, 12మందికి గాయాలు, విద్యార్ధుల రాళ్ళ దాడి

గాయపడిన విద్యార్థులను గాంధీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రులకు తరలించారు. ఓయూ క్యాంపస్‌లో లాఠీచార్జిపై వీసీ తిరుపతిరావు విచారం వ్యక్తం చేశారు. పోలీసు వాహనానికి విద్యార్థులు నిప్పు పెట్టటంతో పూర్తిగా దగ్థమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో వేణుగోపాల్ రెడ్డి మృతదేహంతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను లేడీస్ హాస్టల్ వద్ద అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications