హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు)లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీస్ కమిషనర్ ప్రసాద రావు చెప్పారు. విద్యార్థులు చేసిన దాడిలో పది మంది పోలీసులు గాయపడ్డారని, తప్పనిసరి పరిస్థితులలో లాఠీ ఛార్జీ చేయవలసి వచ్చిందని ఆయన వివరించారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేసుకుంటే తాము అడ్డుకోము అని ఆయన అన్నారు. ఉస్మానియా మినహా నగరంలో బంద్ ప్రశాంతంగా సాగుతోందని కొత్త కమిషనర్ ఎకె ఖాన్ మీడియా ప్రతినిధులకు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైనందున విద్యార్థులు సంయమనం పాటించాలని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యార్థులు బలిదానాలకు పాల్పడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) విద్యార్థులు మరో వాహనానికి నిప్పు పెట్టారు. పోలీసులు యూనివర్సిటీ కేంపస్‌ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు ఇక్కడ ఎందుకు ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి