వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ బంద్ తో జన జీవనం అస్తవ్యస్ధం

తెలంగాణ బంద్ తో రాజధానిలో జనజీవనం స్తంభించింది. సిటీబస్సులు పూర్తిగా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు మూతపడటంతో ప్రధాన కూడళ్ళన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎంఎంటీ ఎస్ రైళ్లను యథావిదిగా నడుపుతున్నట్లు రైల్వేఅధికారులు తెలిపారు.
దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో ఇబ్బంది పడుతున్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్దఎత్తున పోలీసుబలగాలు మోహరించాయి. తెలంగాణ ప్రాంతమంతా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. నేడు జరగవల్సిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం వాయిదా పడింది. బంద్ కారణంగా సమావేశం వాయిదా పడినట్లు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.