యూఎస్ లో ఆపరేషన్ చెక్ మేట్.. 30మంది భారతీయులు అరెస్ట్, త్వరలో స్వదేశానికి!

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్రమంగా నివసిస్తున్న, ట్రక్ డ్రైవర్లుగా పని చేస్తున్న 30 మంది భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. వారిని త్వరలోనే స్వదేశం తిరిగి పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

యూఎస్ లో ఆపరేషన్ చెక్ మేట్.. 52మంది అరెస్ట్

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు గత నెలలో ఆరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్‌లో 'ఆపరేషన్ చెక్‌మేట్' పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 52 మందిని అక్రమ నివాసం కారణంగా అరెస్టు చేశారు. వీరిలో 36 మంది సెమీ ట్రక్కులు నడిపే డ్రైవర్లు. వారిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన 6 మంది మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందినవారు.

30 Indian truck drivers arrested in USA illegally to be deported US another shock for indians

కేసులు, బహిష్కరణ చర్యలు

అరెస్టు అయిన భారతీయుల వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల నుంచి ఇచ్చిన వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. కొందరి వద్ద లైసెన్సులు కూడా లేవని అధికారులు వెల్లడించారు. ఫెడరల్ చట్టాల ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేసి, దేశం నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టారు.ఈ ఆపరేషన్ లక్ష్యం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజా భద్రతను కాపాడటమేనని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారి ఒకరు తెలిపారు.

భారతీయ ట్రక్ డ్రైవర్ ల అరెస్ట్ .. వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం

అక్రమంగా ట్రక్కులు నడుపుతున్న వ్యక్తులు రోడ్డు భద్రతకు ముప్పుగా మారవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యలు అమెరికాలో చట్టబద్ధంగా పని చేస్తున్నవారికి కూడా హెచ్చరికగా మారాయి. భారతీయుల అరెస్టు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అమెరికాలో ట్రక్ డ్రైవింగ్ ఉద్యోగం ఎంతో మంది భారతీయులకు ఆదాయ మూలంగా ఉంటుంది. అయితే, వీసా నిబంధనలు, వర్క్ పర్మిట్లు లేకుండా పని చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్!
ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు మరిన్ని జరగవచ్చని అంచనా

భారత సర్కారు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని, ప్రభావితులైన కుటుంబాలకు సహాయం అందించాలని ఆశిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో ఉపాధి కోసం వెళ్తున్న భారతీయులు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని హెచ్చరికగా మారింది. ట్రంప్ యంత్రాంగం అక్రమ వలసలపై కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు మరిన్ని జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+