నమ్మి సర్వస్వం అర్పిస్తే.. గర్భవతిని చేసి రెండుసార్లు..
"నన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి జీవించనివ్వు.. లేదా ఇద్దరం కలిసి పురుగుల మందు తాగి చనిపోదాం" అంటూ ఓ ప్రియురాలు తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి, మౌన పోరాటానికి దిగిన హృదయవిదారక ఘటన
స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన జూల రాజు, స్రవంతి దంపతుల కుమారుడు వంశీకి.. అదే గ్రామానికి చెందిన భైరబోయిన సుభాష్, శిరీష దంపతుల రెండవ కుమార్తె మనీషాతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. "నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి" అంటూ వంశీ ఒత్తిడి చేయడంతో.. అతను ఉద్యోగం చేస్తున్న ఇనుగూర్తి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం సాగించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వంశీ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

రెండుసార్లు అబార్షన్.. చివరకు నమ్మకద్రోహం!
ఈ క్రమంలో మనీషా గర్భవతి కాగా.. వంశీ అసలు రంగు బయటపడింది. "నువ్వు ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటేనే తర్వాత పెళ్లి చేసుకుంటా" అని నమ్మించి, బలవంతంగా రెండుసార్లు అబార్షన్ చేయించినట్లు బాధితురాలు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేసింది. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని నిలదీస్తే.. "మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను" అంటూ మాయమాటలతో ముఖం చాటేశాడు. అన్ని రకాలుగా వాడుకుని, జీవితాన్ని నాశనం చేసిన ప్రియుడి నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయిన మనీషా.. చివరకు న్యాయం కోసం పొగళ్లపల్లిలోని వంశీ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది.
రంగంలోకి పోలీసులు.. స్టేషన్‌కు బాధితురాలు
"నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వంశీతోనే నాకు వివాహం జరిపించాలి. లేకుంటే నాకు చావే శరణ్యం. పోలీసులు, అధికారులు స్పందించి నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి" అని బాధితురాలు వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొత్తగూడ ఎస్ఐ రాజ్‌కుమార్ బాధితురాలితో మాట్లాడి, ఆమెకు నచ్చజెప్పారు. ప్రియుడు వంశీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరారు. నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి, కౌన్సిలింగ్ నిర్వహించి, చట్టప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో.. మనీషా పోలీసులతో కలిసి స్టేషన్‌కు వెళ్ళింది.














Click it and Unblock the Notifications