బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు

సరస్వతీ దేవి జన్మదినమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విజ్ఞానవంతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే సాధారణ భక్తులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్షరశ్రీకారం పూజలను బుధవారం వేకువ జామున నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో పక్క పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలు మంగళవారం నాడే బాసరకు చేరుకున్నాయి.
సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులతో దేవస్థానం వద్ద గల సత్రాలు నిండిపోయాయి. దేవస్థాన గదులన్ని అధికారులు వీఐపీలకు కేటాయించడంతో భక్తులకు ఇక్కట్లు మొదలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో వందల మంది భక్తులు ఆలయ పరిసరాల్లోనే నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications