ఆమోదించేవరకు హైదరాబాద్ లోనే: నాగం జనార్ధన్ రెడ్డి

అంతేకాక తమ రాజీనామాలు ఆమోదించేంత వరకు హైదరాబాద్‌ను వీడివెళ్లమని నాగం స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం లభించేంత వరకు హైదరాబాద్ లోనే బస చేస్తామని నాగం తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు అసెంబ్లీలోని ఆపార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో భేటి అయ్యారు. ఇవాళ జరిగే తెలంగాణ రాజకీయ జేఏసీ భేటిలో అనుసరించాల్సిన వ్యూహంపై తెదేపా నేతల సమావేశం చర్చించింది. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో సహా తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినప్పుడే, తెలంగాణ ప్రక్రియ మొదలౌతుందని తెలంగాణ తెదేపా నేతలు చెబుతున్నారు. ఈమేరకు జేఏసీలో ఒత్తిడి తీసుకురావాలని వారు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications