బందరు వద్ద కూలిన పురాతన వంతెన, తప్పిన ప్రమాదం

వంతెన కూలడంతో పాదచారుల కోసం ప్రత్యామ్నాయంగా అధికారులు రెండు పడవలు ఏర్పాటు చేశారు. పడవల్లో ఎక్కేందుకు పెద్ద క్యూ ఏర్పాటైంది. కొందరు క్యూలో నిలబడ లేక కాల్వలో ఈదుకుంటూ వెళ్ళారు. ఒక పడవ కాల్వలో మునగడంతో ఎటువంటి నష్టం జరగకపోయినా లోపల ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు.
1864లో నిర్మించిన పురాతనమైన వంతెన కావడంతో పాటు ప్రత్యామ్నాయ రహదారి లేక పోవడంతో సామర్ధ్యానికి మించి వాహనాలు అధిక లోడుతో వెళ్ళడంతో వంతెన కూలిపోయింది. పెద్ద ప్రమాదమే తప్పింది. ఈవంతెన స్థానంలో బెయిలీ బ్రిడ్జి నిర్మించడానికి కనీసం ఐదు రోజులు పట్టవచ్చని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications