హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విద్యార్ధుల ఆగ్రహజ్వాల

హోంమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ మరికొన్ని చోట్ల నుంచి కూడా విన్పిస్తోంది. ఎటువంటి బాధ్యతలూ అధికారాలూ లేని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. అలా చేస్తే..తెలంగాణ కోసం పోరాడిన ఇంద్రారెడ్డి ఆత్మ శాంతిస్తుందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన దీక్షల్లో ఐదో రోజు ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, డాక్టర్ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కె.సత్యనారాయణ, శ్రీరాంభద్రయ్య, టీఆర్‌ఎస్ నేత వేముల సురేందర్‌రెడ్డితోపాటు 28 మంది కూర్చున్నారు. తమను తెలంగాణ జేఏసీగా పిలవాలని కోదండరాం ఈ సందర్భంగా మీడియాను కోరారు.












Click it and Unblock the Notifications