రేపు తిరుమలలో రథ సప్తమి వేడుకలకు రంగం సిద్ధం

Tirumala
తిరుమల: తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఏటా మాఘ శుద్ధసప్తమి, సూర్యజయంతి రోజున సప్తగిరీశుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడువాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తాడు.

మధ్యా హ్నం 12గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకొక్కటి మాత్రమే చూడగలిగే ఈ వాహనసేవా వైభవాన్ని రథసప్తమి నాడు ఒకేరోజున తిలకించవచ్చు. ఈ సందర్భంగా నిత్యం ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీసేవలను రద్దు చేశారు.

ఆరోజు ఉదయం నుంచి రాత్రి వ రకు వరుసగా జరిగే ఊరేగింపుసేవలు వివరాలు..ఉదయం 5.30-7 గంటల మధ్య సూర్యప్రభ వాహనం, 9-10 చిన్నశేషవాహనం, 11-12 గరుడవాహనం, మధ్యాహ్నం 12-1 గంటల మధ్య చక్రస్నానం, సాయంత్రం 4-5 కల్పవృక్ష వాహనం, 6-7 సర్వభూపాల వాహనం, రాత్రి 8-9 మధ్య చంద్రప్రభ వాహనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+