నేడూ బంద్, మేడారం బస్సులకు మినహాయింపు

ఈ జాతరకు వెళ్లే బస్సులు జై తెలంగాణ, సమ్మక్క-సారక్క జాతర స్పెషల్ అని బోర్డులు పెట్టుకుని వెళ్లాలని విద్యార్థి జేఏసీ నేతలు సూచించా రు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ గురువారం ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు శాంతిర్యాలీ నిర్వహిస్తామన్నారు.
యూనివర్సిటీలో లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడానికి కేవీపీనే బాధ్యుడిని చేసి ఆయన్ను తొలగించాలని కోదండరాం డిమాండ్ చేశారు. మంత్రుల అధికారిక కార్యక్రమాలను బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 23న నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రణభేరికి మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications