నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణం వీక్లీ మార్కెట్‌లో సురేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాదన్న మనస్తాపంతో సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలంగాణ కోసమే తాను చనిపోతున్నట్లు అతను సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం.
మృతుడు మొదటి నుంచి తెలంగాణ అభిమాని అని, తెలంగాణకు మద్దతుగా ఏ కార్యక్రమం జరిగినా చురుకుగా పాల్గొనేవాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. కాగా మెదక్ రాజీవ్ గృహకల్పలో ఆళ్లగడ్డ దశరథ్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసమే దశరథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి