న్యూఢిల్లీ: తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని సోనియాతో తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను సోనియా ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి సహకరించాలని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై ప్రజలు సహకరించాలని కూడా సోనియా అన్నట్లు ఆయన చెప్పారు. ఆందోళనల సమయంలో సంయమనం పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని, విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని సోనియా చెప్పినట్లు ఆయన తెలిపారు. డి. శ్రీనివాస్ గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి