శ్రీకాకుళం: ఒరిస్సాతో ఉన్న జల వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాను మాట్లాడుతానని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. ఆంధ్రా, ఒరిస్సా నదీ జలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిదిమి గ్రామంలో ఆయన శనివారం ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆయన విన్నారు. శ్రీకాకుళంలోని 100 పడకల ఆస్పత్రిని ప్రజల విజ్ఞప్తి మేరకు పాలకొండకు తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రుసింగ్ వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
తాను ప్రజా సమస్యలు వినడానికి ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరించి సంకల్పించారని, దురదృష్టవశాత్తు మనం ఆ నేతను కోల్పోయామని ఆయన అన్నారు. ఆయన వెంట ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి