ఢిల్లీలో చిరంజీవి సమైక్యాంధ్ర లాబీ

Chiranjeevi
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఢిల్లీకి తీసికెళ్లారు. ఎన్నికల కమిషన్ 60 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వచ్చారు. పనిలో పనిగా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పావులు కదపడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అంగీకరించకూడదని కోరడానికి ఆయన రైల్వే మంత్రి మమతా బెనర్జీని కలుస్తారు. మిగతా యుపిఎ భాగస్వామ్య పక్షాల నేతలతో కూడా కలవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్సీపి నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కూడా తాను కలుస్తానని చిరంజీవి చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడపడానికి రంగంలోకి దిగిన చిరంజీవి ఈ దిశగా పనిచేసుకుంటూ పోతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఆయన సమైక్యాంధ్రను కోరుతూ యాత్రలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు పార్టీ శాసనసభ్యులు వ్యతిరేకించినా ఆయన పట్టించుకోవడం లేదు. పైగా, తన కుటుంబ సభ్యుల సినిమాల ప్రదర్శనలను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+