మేడారం జాతరకు హెలికాప్టర్ ఎక్కనున్న సిఎం

Rosaiah
వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం మధ్యాహ్నం వెళ్లనున్నారు. జాతరలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె రోశయ్య మంగళవారం మేడారం రానున్నారని వరంగల్ జిల్లా శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నేరుగా మేడారం చేరుకుంటారన్నారు. ఆయన పాటు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, పి.బాలరాజు, గాదె వెంకటరెడ్డి హాజరవుతారని తెలిపారు. 12 గంటలకు ముఖ్యమంత్రి తులాభారం, మొక్కులు చెల్లిం చుకునే కార్యక్రమం ఉంటుందని, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతారని చెప్పారు.

జాతర కోసం మేడారం సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. ఈనెల 27 నుంచి 30 వరకు అత్యంత వైభ వంగా జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు 80 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకునే అవకాశం ఉందనే అంచనాల మేరకు వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు వివిధ శాఖల నుంచి సుమారు రూ. 23 కోట్ల ఖర్చు చేసినట్లు వివరించారు.

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా మేడారం జాతరలో పాల్గొననున్నారని కలెక్టర్‌ తెలిపారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు లక్షల సంఖ్యలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారని పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశామని వివరించారు.

భక్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంటుందని కలెక్టర్‌ శ్రీధర్‌ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆర్టీసీ 2700 బస్సులను నడుపుతోందన్నారు. పస్రా-తాడ్వాయి, తాడ్వాయి-మే డారం మధ్య అన్ని కేంద్రాల్లో అదనపు బస్సుస్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏర్పాట్లను సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతోపాటు వంద మంది హోంగార్డులు భక్తులకు సహకరిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+