హైదరాబాద్: రాజీనామాలకు ఈ నెల 28వ తేదీన తెలంగాణ జెఎసి డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు రేపు మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగైదు రోజులు ఢిల్లీలో ఉంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ అంశంపై విస్తృతంగా చర్చించామని, తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఆయన చెప్పారు. తమకు సిడబ్ల్యుసి సభ్యుడు కె. కేశవరావు నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.