రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిఘానేత్రాలు

పేలుడు పదార్థాలను గుర్తించడం, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రహదారులపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఉత్తర మండలంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పేలుడు పదార్థాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారుల్లో చురుగ్గా ఉన్న కొంతమంది యువకులకు పేలుడు పదార్థాలను పసిగట్టేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
గణతంత్ర వేడుకల్లో ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. వ్యాపార సంస్థలు, సినిమాహాళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలపై దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications