వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన చర్చలు, శాంతించిన దుర్గ గుడి అర్చకులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: ఇవో వైఖరికి నిరసనగా సామూహిల సెలవులకు సిద్ధమైన దుర్గ గుడి అర్చకులు ఎట్టకేలకు దిగి వచ్చారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడానికి సిద్ధమవడం కలకలం రేపింది. దుర్గగుడిలో సుమారు 80 మంది అర్చకులు పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా అర్చకులు దుర్గగుడి అధికారులపై ఆగ్రహం ప్రకటిస్తూ, సామూహిక సెలవు పెట్టడానికి సిద్ధమయ్యారు.

ఈవో విజయకుమార్‌ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వీరు తమ నిర్ణయాన్ని ఆల య సహాయ కమిషనర్‌ శారదాకుమారికి తెలియజేశారు. దీనితో ఆలయ అధికారులు, అర్చక సంఘ నేతలు, సీనియర్‌ అర్చకుల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈవో విజయకుమార్‌కు తాను అర్చకులనుద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చాలాసేపు తర్జన భర్జనలు జరిగాయి. ఈవో క్షమాపణలు చెప్పాలని కొంతమంది అర్చకులు పట్టుబట్టగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.

సీనియర్‌ అర్చకులు ఇతర అర్చకులందరికీ నచ్చచెప్పి సె లవు పెట్టాలన్న నిర్ణయాన్ని విరమించుకునే విధంగా ఒ ప్పించారు. అర్చకులు తగినంత సంఖ్యలో లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని అటు అధికారులు, ఇటు అర్చకులు కూడా అంగీకరించారు. దీనివల్లనే కొంతమంది అర్చకులు సహాయకులను నియమించుకోవాల్సి వస్తున్నదని వివరించారు. అయితే అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇటువంటి వాటిని అంగీకరించలేమని చెప్పారు.

దుర్గగుడిలో మూడు సంవత్సరాల క్రితం ఒక పాలకమండలి ఉన్నపుడు అప్పటి పాలకమండలి చైర్మన్‌ కు వ్యతిరేకంగా కొద్ది సమయం పాటు అర్చకులు విధులు బహిష్కరించారు. ఒక్కసారిగా అర్చకులు విధులు బహిష్కరిస్తున్నామంటూ రావడం ఇదే మొదటిసారి. విజయకుమార్‌ మూడు నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అయన వచ్చినప్పటినుంచి దుర్గగుడి ప్రక్షాళన చేపట్టారు. అర్చకులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలుసుకు న్న ఈవో వారితో మాట్లాడంతో వారు విధుల్లో చేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X