తెలంగాణకు సారథ్యం వహించను: కె కేశవరావు

తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడం లేదని ఈ ప్రాంత నాయకుల్లో ఆవేదన నెలకొనడం సహజమని ఆయన అన్నారు. తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని అన్ని పార్టీలు ఎన్నికల్లో మానిఫెస్టోలో పెట్టినప్పుడే తెలంగాణ వచ్చేసినట్లయిందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో పెట్టిందని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చేర్చిందని, దాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని ఆయన చెప్పారు. అందుకే అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సూచించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications