సీమాంధ్ర నేతలకు కోదండరామ్ సవాల్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మర్నాడు గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ నెల 28వ తేదీన అంతటా ర్యాలీలు తీసి మండల కేంద్రాలకు చేరుకోవాలని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులున్నారని సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి విమర్శించారు. మావోయిస్టుల బూచీ చూపి ఉద్యమాన్ని దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications