వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో అదృశ్యమైన పసికందు, గాలింపు ముమ్మరం

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasam Barrage
విజయవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో మాయం అయిన పసికందు అచూకీ ఆదివారం రాత్రి వరకు తెలియరాలేదు. ఎవరు తీసుకువెళ్ళారన్న దానిపై పోలీసులు తలలు పట్టుకున్నారు. సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరిని విచారించినా ఫలితం కనిపించలేదు. తెల్లారే వరకు గేటుకు తాళాలు ఉంటాయని, చీమ కూడా బయటకు పోయే అవకాశం లేదని చెబుతున్న నేపథ్యంలో పసికందు మాయం అంతుబట్టకుండా ఉంది. పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

అస్పత్రి సూపరింటెండెంట్‌ పాలడుగు రాంబాబు, ఆర్డీవో ధర్మారెడ్డి, ఏసీపీ ప్రకాశరావులు, పాత ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లాల్‌ చాంబర్‌లో కూర్చుని విచారణ నిర్వహించారు. ఎక్కడా క్లూ దొరకలేదు. అయితే అర్ధరాత్రి మూడున్నర సమయంలో స్వీపర్‌ ఒకరు కిందకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆమెను విచారించాల్సి ఉందంటున్నారు. పసికందు బంధువులను కూడా విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

ఏసమ్మకు 12 సంవత్సరాల క్రితమే వివాహమయింది. సంతానం లేకపోవడంతో వదిన బిడ్డను పెంచుకుంటున్నది. ఆమె గర్భం దాల్చి మగబిడ్డను కనింది. దీంతో ఇప్పటిదాకా పెంచుకున్న బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచనతో బంధువులే పసిబిడ్డను మాయం చేసి ఉంటారన్న కోణంతో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇంకొక పక్క ఏసమ్మ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదని, డబ్బు కోసమే ఇదంతా చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగే అవకాశం ఉంది. అస్పత్రిలో సిబ్బందే తన బిడ్డను మాయం చేశారని ఏసమ్మ బంధువులు ఆరోపిస్తుండగా, ఏసమ్మ బంధువులే బిడ్డను ఎత్తుకెళ్ళి ఉంటారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రెండు వాదనలు వినవస్తున్నందున గట్టిగా విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆస్పత్రి మొదటి అంతస్థు వార్డు తలుపువద్ద కూడా సెక్యూరిటీ గార్డును నియమించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X