కృష్ణా జిల్లా: అక్కినేని వారధిపై జూదం, వ్యభిచారం

రెండు నెలల క్రితం రోడ్లు, భవనాలశాఖ మంత్రి గల్లా అరుణకుమారి మండలానికి వచ్చినప్పుడు ఈ సమస్యను వివరించగా, వంతెనపై లైట్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారని కుదరవల్లి సర్పంచ్ గోధుమ శైలజ తెలిపారు. అయితే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు.
వంతెనపై లైట్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిషత్ నుంచి రూ.5 లక్షలు నిధులు మంజూరైన సంగతి వాస్తవమేనని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ వంతెనపై పోల్స్, లైట్లను ఏర్పాట చేస్తే, విద్యుత్ సరఫరా చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.












Click it and Unblock the Notifications