రాష్ట్రం విడిపోతే డెల్టా బంజరౌతుంది: ప్రజారాజ్యం

తొలిదశ ఉద్య మాన్ని చిరంజీవి పూర్తి చేశారన్నారు. తదుపరి దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. చిరంజీవి ఢిల్లీ పర్యటన సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టడమేనన్నారు. ఇతర జాతీయ పార్టీల మద్దతుతో ఐక్యతకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, వసంతల అప్పారావు తదితరులున్నారు.
పార్టీ పటిష్టతకు నియోజకవర్గ విస్తృతస్థా యి సమావేశాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, కాకినాడ-1..2, పెద్దాపురం, ముమ్మిడివరం నియోజ కవర్గాల్లో సమావేశాలు పూర్తి చేశా మన్నారు. ఈ నెల 31న పిఠాపురం ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజక వర్గాల సమావేశాలు ఏర్పాటు చేస్తు న్నామన్నారు.
ఫిబ్రవరి నెలాఖరు కల్లా జిల్లా మొత్తం పూర్తి చేస్తామ న్నారు. పార్టీని బలోపేతం చేసే చర్యలతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టనున్నామని నెహ్రూ తెలిపారు. ప్రభుత్వం కార్డుల ఏరివేత పేరుతో పేదలను ఇబ్బం దులకు గురి చేస్తోందని విమర్శిం చారు. దీనిపై తమ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందన్నారు.












Click it and Unblock the Notifications