రాజీనామాలు చేయాల్సిందే: టిడిపి

ప్రజాప్రతినిధులు, మంత్రులు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం ఉండదని, వారికి అపాయింట్ మెంటు కూడా దొరకదని ఆయన అన్నారు. తెలంగాణకు తెలుగుదేశం కట్టుబడి ఉందని, ఈ అంశంపై పార్టీలన్నీ ఒకే తాటి మీదికి రావాలని ఆనయ అన్నారు. ఇస్తారా, చస్తారా అనే పద్ధతిలో పోతేనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష కోసమే తాము కలిసి ఉన్నామని, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి పని చేస్తున్నామని ఆయన చెప్పారు. జెఎసి కన్వీనర్ కోదండరామ్ ను సీమాంధ్ర నాయకులు విమర్శించడాన్ని మరో తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ తప్పు పట్టారు. తెలంగాణ రాజకీయ నాయకులంతా తీసుకున్న నిర్ణయాలను కోదండరామ్ వెల్లడిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications