రాజీనామాలపై వెనక్కి తగ్గిన కాంగ్రెసు

తెలంగాణపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు కేశవరావు నాయకత్వంలో ఢిల్లీ వెళ్తున్నట్లు అరుణ చెప్పారు. ఒక సీనియర్ నాయకుడి నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకు కేశవరావును ఎంపిక చేసుకున్నామని ఆమె చెప్పారు. రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి అధిష్టానం కాదని ఆమె అన్నారు. జెఎసి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిందని, అయితే ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి నిర్ణయించామని అరుణ చెప్పారు.












Click it and Unblock the Notifications