కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహిందా రాజపక్షే ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఆయన విజయం ఖాయమైంది. ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. తన అపజయం ఖాయమని గ్రహించిన ప్రత్యర్థి ఫొన్సెకా తన ఇంటి నుంచి హోటల్ కు మారారు. ఆయన ఉన్న హోటల్ ను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికే మహిందా రాజపక్షే పది లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. మంగళవారం శ్రీలంక అధ్యక్ష పదవికి పోలింగ్ జరిగింది. తనను చంపడానికే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఫొన్సెకా ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే ఫోన్సెకాకు ఎటువంటి అవాంతరాలు కల్పించబోమని, స్వేచ్ఛగా తిరగనవచ్చునని ఆర్మీ చీఫ్ అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి