తుది దశలో తెలంగాణపై కమిటీ: చిదంబరం

కాగా, కాంగ్రెసు తెలంగాణపై కమిటీ లేదా కమిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆ ముసాయిదాకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆ ముసాయిదాను కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించే అవకాశం ఉంది. క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత చిదంబరం తెలంగాణపై మరో ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications