ముంచుకొచ్చిన గడువుతో కష్టాల్లో కాంగ్రెసు

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పిలుపు రావడంతో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు ఆర్ దామోదర్ రెడ్డి, కె. జానా రెడ్డి ఢిల్లీ వెళ్లారు. వారు అక్కడే వుండి అధిష్టానానికి చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీకి ఎవరూ రావద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర నాయకులను ఆదేశించారు. అయినప్పటికీ చాలా మంది కాంగ్రెసు నాయకులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అయితే ఈ సాయంత్రంలోగా ప్రకటన వస్తుందని ఆర్ దామోదర్ రెడ్డి అంటున్నారు. రేపటి వరకు గడువు ఉందని, తప్పకుండా కేంద్రం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. రాజీనామాల వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ జెఎసి గురువారం సమావేశమవుతోంది.












Click it and Unblock the Notifications