సోనియాకు బుద్ధి ప్రసాదించాలి: దత్తాత్రేయ

ఆనాడు ప్రజల కోసం సమ్మక్క, సారలమ్మ ఆత్మబలిదానాలు చేశారని, ఇప్పుడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. తాము నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి తెలంగాణ కోసం ఆశీస్సులు పొందుతామని ఆయన చెప్పారు. తెలంగాణపై సోనియా గాంధీకి బుద్ధి ప్రసాదించాలని కోరుతామని ఆయన అన్నారు. జెఎసి గడువు ముగిసిందని, దాంతో ప్రజాప్రతినిధుల రాజీనామాకు తెలంగాణ జెఎసి ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications