గ్రీన్ సిటీ హోదాకు మహా విశాఖ ప్రతిపాదనలు

Vishakapatnam
విశాఖపట్నం: ప్రపంచంలోనే రెండో అందమైన నగరంగా బ్రెజిల్‌ తర్వాత స్థానాన్ని దక్కించుకున్న మహా విశాఖ ఇక ఒకేసారి 63 నగరాలతో పోటీ పడి రెండు జాతీయస్థాయి పురస్కారాలు పొంది దేశంలో అపురూప గౌరవాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు గ్రీన్‌ సిటీగాగా కూడా విశాఖ వైభవాన్ని చాటిచెప్పేం దుకు అహ్మదాబాద్‌ వేదిక కానున్నది. పచ్చని ప్రకృతి, ఆపై అడవులు, ఎత్తయిన కొండలు, సొగసైన సాగరతీరం...ఇవన్నీ కలగలిపి నగరానికి ప్రత్యేక పేరుప్రతిష్ఠలు తీసుకురానున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఐదు శాతం అటవీ ప్రాంతముండగా విశాఖ నగరాన్ని 19శాతం అటవీ ప్రాంతం ఆనుకుని ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ కమిషనర్‌ విష్ణు సార«థ్యంలో ఇప్పటికే గ్రీన్‌ సిటీగా విశాఖకు వున్న ప్రత్యేకతలన్నింటినీ కలగలిపి (డీపీఆర్‌) పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారుచేయాలని అధికారులు సంకల్పించారు.

ఈ డీపీఆర్‌కు సంబంధించి నగరంలో ఎంతమేర ప్రకృతి ఉంది, అడవులు, కొండలు, సాగరతీరం వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలతో అన్ని వివరాలు పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదలచేసే అవకాశముందని అధికారులు అంచనాలు రూపొందించారు.

అంతర్జాతీయ సదస్సులో..అర్బన్‌ గవర్నెన్స్‌పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జీవీఎంసీ కమిషనర్‌ విష్ణు, ప్రాజెక్ట్స్‌ అదనపు కమిషనర్‌ పోల భాస్కర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ బి.జయరామిరెడ్డిలు బుధవారం బయలుదేరి వెళ్లారు. విశాఖకు సంబంధించి ఈ సదస్సులో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

నగరం అందచందాలు, ప్రకృతిగొప్పతనం వివరించి ఇతర నగరాలకంటే మంచి మార్కులు సాధించే అవకాశముందని భావిస్తున్నారు. మహా విశాఖకు మంచి గుర్తింపు రావడం ఖాయమని ఇంజనీరింగ్‌ అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు, ప్రాజెక్టులు, పట్టణ పేదల మౌలిక సదుపాయాలతోపాటు పలు అంశాలు చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+