మేం అనుకున్నట్లు లేదు : కోదండరామ్

తెలంగాణపై తమ పార్టీ నాయకురాలు సోనియాపై తమకు నమ్మ కం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. నమ్మకం కుదరకపోతే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి నేతలు సోనియా గాంధీని కలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వారు తమ కాంగ్రెసు అధిష్టానం నుంచి స్పష్టత పొందవచ్చునని ఆయన అన్నారు. అయితే, తెలుగదేశం నాయకులు మాత్రం మరో రకంగా ప్రతిస్పందిస్తున్నారు. కాల పరిమితితో కూడిన ప్రకటనతో పాటు తెలంగాణపై బిల్లు పెడతామని ప్రకటించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు వేణుగోపాల చారి డిమాండ్ చేశారు. చిదంబరం ప్రకటనను ఢిల్లీలోని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు జానా రెడ్డి, దామోదర్ రెడ్డి ఆహ్వానించారు. కాగా, తాజా పరిస్థితిపై చర్చించేందుకు తెలంగాణ జెఎసి గురువారం సాయంత్రం సమావేశమవుతోంది.












Click it and Unblock the Notifications