కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర రెడ్డితో కలిసి ఆయన గురువారం రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల విషయంలో కెసిఆర్ తీరును ఆయన తప్పు పట్టారు. ఆంటోనీతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజీనామాలకు జెఎసి పెట్టిన గడువును తాము పట్టించుకోవడం లేదని, అయితే తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని తాము అధిష్టానాన్ని కోరామని ఆయన చెప్పారు. రాజీనామాల విషయంలో కెసిఆర్ వ్యవహార శైలి సరిగా లేదని, కెసిఆర్ సంయమనం పాటించాల్సి ఉంటుందని సుధాకర రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు. రాజీనామాలకు జెఎసి విధించిన గడువు ముగియడానికి ఇంకా సమయం ఉందని, ఈలోగా కేంద్రం సానుకూలంగా ముందుకు వస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యతను గమనించింది కాబట్టే తెలంగాణ ప్రక్రియకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు.

రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాల్సిన అవసరం లేదని, గడువులతో సంబంధం లేకుండా సాగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ నేతలు గురువారం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. సోనియాపై తమకు స్పష్టమైన విశ్వాసం ఉందని, నిర్ణీత కాలవ్యవధితో తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం తమకు ఉందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+