జమ్ము: ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు భారత జవాన్లను హత్య చేశారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్రర్ జిల్లా తాండారు గ్రామం వద్ద జరిగింది. ఉగ్రవాదులుగా భావిస్తున్నవారు గస్తీలో ఉన్న సైనిక పటాలంపై మెరుపు దాడి చేసినట్లు జమ్మూ అధికార వర్గాలు చెప్పాయి.
సంఘటన గురించి తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపారు. గాలింపును ముమ్మరం చేశారు. మృతి చెందిన జవాన్లను ఇంకా గుర్తించాల్సి ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి