సోమవారం తెలంగాణ కోసం కమిటీ?

కోర్ కమిటీ చర్చల వివరాలను ప్రణబ్ ముఖర్జీకి తెలిపి ఆయన అభిప్రాయం కూడా తీసుకుని కమిటీపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కమిటీ కూర్పు అనేది న్యాయశాఖకు సంబంధించింది కాబట్టి హోం మంత్రి చిదంబరంతో పాటు వీరప్ప మొయిలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కమిటీ అధ్యక్షుడిగా శ్రీకృష్ణ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆయనే ఖరారు కావచ్చునని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ ధ్రువీకరించలేదు. కమిటీ ఏర్పాటు కావడానికి రెండు మూడు రోజులు పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
