ముంబై: బాలీవుడ్ అగ్రహీరోలు షారుక్, అమీర్‌ఖాన్ ఇద్దరూ ఇడియట్స్ అని శివసేన ధ్వజమెత్తింది. పాక్ క్రికెటర్లను ఐపిఎల్‌లోకి తీసుకోవచ్చని అభిప్రాయపడిన వీరికి ఏ మాత్రం దేశభక్తి లేదని శివసేన తేల్చేసింది. పాక్ క్రికెటర్లకు మద్దతు తెలిపిన ఈ ఇద్దరు హీరోల వైఖరిపై 'టూ ఇడియట్స్' అంటూ శివసేన అధికారిక పత్రిక 'సామ్నా' ఓ కథనం వెలువరించింది. శత్రువులకు మద్దతు తెలుపుతున్న షారుక్, అమీర్ ఇద్దరూ నిజజీవితంలోనూ ఇడియట్సేనని ఆ కథనంలో పేర్కొన్నారు.
పిచ్చి ప్రకటనలు చేస్తూ భారతీయుల మనోభావాల ను దెబ్బతీస్తున్నారని శివసేనను ఉటంకించింది. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో పాక్ క్రికెట ర్లను పక్కన పెట్టడంతో విమర్శలు చెలరేగడం తెలిసిందే. దీనితో ఆ దేశ క్రికెటర్లకు మద్దతుగా కోల్‌కత్తా ప్రాంచైజీ ఓనర్ షారుక్, ఓ సందర్భంలో అమీర్ మద్దతు పలకడం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి