హైదరాబాద్: హైదరాబాదులోని హబ్సిగుడాలో గల మాగ్నా సూపర్ మార్కెట్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అర్పే ప్రయత్నం చేస్తున్నారు. భవంతి సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్ మంటల్లో చిక్కుకున్నాయి.
భారీగా పొగ వస్తుండడంతో పక్కన ఉన్న అపార్టుమెంటులకు చెందినవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పొగ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం అగ్నిమాపక సిబ్బందికి అంతు చిక్కడం లేదు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియడం లేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి