న్యూఢిల్లీ: పదవులకు రాజీనామా చేసిన అమర్ సింగ్ వెంటే తాను ఉంటానని సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద స్ప్షష్టం చేశారు. రాజకీయాల్లో తనకు అండగా నిలిచిన అమర్ సింగ్ కు తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అమర్ సింగ్ పై సమాజ్ వాదీ పార్టీ నేతల నుంచి అమర్ సింగ్ పై ఒత్తిడి వస్తున్న క్రమంలో ఆమె ఆ విషయం చెప్పారు. ఇబ్బందులను ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో అమర్ సింగ్ అండగా నిలుస్తానని ఆమె చెప్పారు.
పార్టీ వైదొలిగే విషయంపై ఆమె నేరుగా ప్రతిస్పందించలేదు. 14 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన అమర్ సింగ్ కే అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరికైనా ఆ పరిస్థితి రావచ్చునని ఆమె అన్నారు. అమర్ సింగ్ తనను పార్టీ తెచ్చారని, ములాయం సింగ్ తనకు సరైన స్థానం కల్పించి పార్టీ టికెట్ ఇచ్చారని, ములాయం తండ్రి లాంటివారని ఆమె అన్నారు. అమర్ సింగ్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకులను ఆదేశించాలని ఆమె ములాయంను కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి