విజయవాడ పాపను చంపేశారు

గుంటూరు జిల్లాలోని ఇనుమును కరిగించే బాయిలర్ లో వేసి వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో వైష్ణవి దేహాన్ని కాల్చేశారు. పాఠశాలకు నవ్వుతూ వెళ్లిన వైష్ణవి బూడిదకప్పై సోమవారం సాయంత్రం దర్శనమిచ్చింది. తన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందని భావించిన తండ్రి ప్రభాకర్ ఆమె మరణ వార్త విని గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. హంతకులు వైష్ణవి చంపడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే ఆమె ప్రాణాలు తీసినట్లు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని బాయిలర్లో వేసినట్లు అనుమానిస్తున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని ప్రభాకర్ చెబుతూ వచ్చారు. అయితే ప్రభాకర్ ను పోలీసు కమిషనర్ రాజేంద్ర రెడ్డి విచారించారు. ఆ విచారణలో కొన్ని విషయాలు తెలిసి కుటుంబ కలహాల దిశగా దర్యాప్తు చేపట్టారు. దాంతో కేసు చిక్కుముడి విడదీసే ప్రయత్నం చేశారు. కానీ పాపను మాత్రం రక్షించలేకపోయారు.












Click it and Unblock the Notifications