17 మంది సారా మృతులకు పరిహారంపై సిఎం మౌనం

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప దగ్గర జరిగిన పడవ ప్రమాదం, విశాఖ దగ్గర పుట్టి మునిగిన దుర్ఘటనలో మృతులకు ఆపద్బంధు కింద రూ50 వేలు, సీఎం సహాయ నిధి నుంచి రూ50 వేలు వెరసి రూ.లక్ష వంతున మృతులకు సహాయంగా రోశయ్య ప్రకటించారు. కల్తీసారా తాగి మరణించిన వారి కుటుంబాలకు మాత్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించ లేదు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇటీవల వచ్చినప్పుడు వెల్లడించారు. కారణాలు ఏమైనప్పటికీ కల్తీసారా దుర్ఘటన మృతులకు ప్రభుత్వం తరపున అంత్యక్రియల కోసం రూ. 5 వేలు, రూ.150 విలువైన నిత్యావసర వస్తువు లను మాత్రమే అందించారు.
ప్రజారాజ్యం పార్టీ మృతుల కుటుం బాలకు రూ.10 వేలు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించారు. సబ్సిడీపై పాడి గేదెలు అందిస్తామన్న జిల్లా అధికారుల ప్రకటన అమలుకు మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ముఖ్య మంత్రి ప్రకటించలేదన్న విషయంపై జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వ రూప్‌ను 'ఆన్‌లైన్' ప్రశ్నించినప్పుడు బాధితులకు మరింత సాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. పడవల ప్రమాదంలో మృతులకు రూ.లక్ష సహాయంగా ప్రభుత్వం ప్రకటించిం దని, కల్తీసారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి తాము ప్రయత్నం చేస్తున్నామని విశ్వరూప్ ప్రకటించారు.
కల్తీసారా మృతి సంఘటనపై పూర్తిస్థాయి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం సహాయం ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. కల్తీసారా మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించడానికి నిబంధనలు అడ్డువస్తాయని మరోకారణంగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ బడుగు, బలహీనవర్గాలకు చెందిన 17 మంది కల్తీసారా దుర్ఘటనలో మరణించగా వందల మంది అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుతున్నా ప్రభుత్వం మాత్రం సహాయం అందించడంలో చేస్తున్న సాయం ఆ కుటుంబాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications