తెలంగాణ ఏర్పాటుకే కమిటీ: కేశవరావు

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో అయోమయం తొలగిపోయిందని మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కమిటీ విధివిధానాలు, కాలపరిమితి త్వరలో ఖరారవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 5వ తేదీ అఖిల పక్ష సమావేశానికి కొనసాగింపుగానే ఈ కమిటీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కమిటీ ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల కోసం పనిచేయదని, ఆంధ్రప్రదేశ్ కోసమే పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ కావాలా, వద్దా కమిటీ వేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఈ కమిటీ వేశారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. సమగ్రత, వ్యక్తితం ఉన్నవారితో కమిటీ ఏర్పాటైందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, వివేక్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications