హైదరాబాద్: అధిక ధరలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో రాజ్‌భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజ్‌భవన్ వైపు దూసుకు వెళుతున్న బిజెపి నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ధర్నాలో బిజెపి నేతలు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రకాష్ జవదేకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, జవదేకర్‌లతోపాటు అరెస్టు చేసిన కార్యకర్తలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చాలాకాలం తర్వాత వెంకయ్యనాయుడు ఒక మంచి పనికోసం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగరంలో బిజెపి కొద్దిగా బలపడుతున్న సమయంలో బిజెపి అదును చూసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి