హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు, తన సన్నిహిత సినీ నిర్మాత కొడాలి నానిపై ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడం, అదుర్స్ సినిమా ప్రదర్శనను తెలంగాణలో అడ్డుకోవాలని తెలంగాణ జెఎసి పిలుపునిచ్చింది. దీంతో అదుర్స్ సినిమా ప్రదర్శనకు తెలంగాణ అంతటా ఆటంకం ఏర్పడింది. దీంతో ఎన్టీఆర్ కొడాలి నాని తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
కొడాలి నాని రాజకీయ నాయకుడిగా మాట్లాడి ఉంటారని ఆయన అన్నారు. ఏ ప్రాంత ప్రజల మనోభావాలనైనా కించపరిచే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణవాదులను కొడాలి నాని కుక్కలుగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో నాని నిర్మించిన అదుర్స్ సినిమాను అడ్డుకోవాలని తెలంగాణ జెఎసి సూచించింది. నాని క్షమాపణలు చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు నాని అంగీకరించడం లేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి