కాంగ్రెసు జెఎసిలో ఉందనుకుంటా: కోదండరామ్

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయించడానికి కమిటీ అవసరం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను బట్టి నిర్ణయం తీసుకుందామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు కోరడంతో ఇంత కాలం ఆగామని ఆయన చెప్పారు. రాజీనామాలపై సమిష్టి నిర్ణయమే తీసుకుంటామని ఆయన చెప్పారు. నిర్దిష్టమైన నిర్ణయాలకు, విధానాలకు మాత్రమే తావు ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంద్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications