ఇరకాటంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు

విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రజలనుంచి కాంగ్రెసు నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కు, మంత్రి శ్రీధర్ బాబుకు ఆందోళనకారులు వేర్వేరు చోట్ల అడ్డం పడ్డారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ వారిని చుట్టుముట్టారు. నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి కె. జానారెడ్డికి కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ స్థితిలో రాజీనామాలకు సిద్ధపడని తెలంగాణ కాంగ్రెసు నాయకులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కునే పరిస్థితి ఉంది. ప్రజల కోరిక మేరకు వ్యవహరించలేక, పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక వారు సతమతమవుతున్నారు.












Click it and Unblock the Notifications