హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిపై నేడు బుధవారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈనెల 13న విద్యార్థులు తార్నాకవైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారని, అయినా వారు వెనుకకు తగ్గకపోవటంతో లాఠీఛార్జి చేశారని, భాష్పవాయువు ప్రయోగించారని ఆమె అన్నారు. ఈ ఘటనలో విద్యార్థులు, జర్నలిస్టులు, పోలీసులు కూడా గాయపడ్డారన్నారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తున్నామని, వారంలోపు నివేదిక ఇస్తామని హోంమంత్రి ప్రకటించారు.
ఈ సంఘటనపై హైకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు హాజరు కావాలని వారు ఆదేశించారు. డిజిపి గిరీష్ కుమార్ ను తీవ్రంగా అభిశంసించారు.