హైదరాబాద్: తెలంగాణ సమస్యకు రాజీనామాలు పరిష్కారం కాదని మాజీ హోంమంత్రి జానారెడ్డి అన్నారు. రాజీనామాల ప్రతిపాదనను తాను మొదటి నుంచి వ్యతిరేకించానన్నారు. అయితే, పోరాడే దారులు వేరైనా తమ ఏకైక లక్ష్యం ప్రత్యేక తెలంగాణ అని స్పష్టం చేశారు. విషయంలో అధిష్టానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని జానారెడ్డి అన్నారు.
రాజీనామా చేయవద్దని తాను కెసీఅర్ కు కూడా సూచించానని ఆయన చెప్పారు. నివిదిక వచ్చిన తర్వాత అది అనుకూలంగా లేకపోతే అప్పుడు చూసుకోవచ్చని జానారెడ్డి గురువారం మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.