ఒయు సంఘటనలు: పోలీసులపై మళ్ళీ హైకోర్టు ఆగ్రహం

ఎవరి అనుమతితో క్యాంపస్‌లో పోలీసు బలగాలను తీసుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. పాత్రికేయుల వాహనాలను కాల్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంది. మహిళా విద్యార్థులను విచక్షణారహితంగా లాఠీఛార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని కమిషనర్‌ను నిలదీసింది. ఓయూలో ఆయన తీరును హైకోర్టు తీవ్రంగా గర్హించింది. కేసుల విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించింది.
కాగా ఓయూ ఘటనల వివరాలను అందచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలను మార్చి 1వ తేదీ కల్లా అందచేస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియచేశారు. దాంతో కేసుల విచారణను హైకోర్టు మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications